: ఎయిర్ టెల్ సీనియర్ ఉద్యోగిని లాగేసుకున్న స్నాప్ డీల్


భారతీ ఎయిర్ టెల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆనంద్ చంద్రశేఖరన్ ను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గా విధుల్లో నియమించుకున్నట్టు ఆన్ లైన్ మార్కెట్ సేవలందిస్తున్న స్నాప్ డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ వెల్లడించింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ పునీత్ సోనీని ఫ్లిప్ కార్ట్ లాగేసుకున్న మూడు నెలల తరువాత స్నాప్ డీల్ హై ప్రొఫైల్ నియామకాన్ని ప్రకటించడం గమనార్హం. తదుపరి దశ అభివృద్ధి దిశగా సాగుతున్న స్నాప్ డీల్ కు మరింత అనుభవం, సామర్థ్యం ఉన్న లీడర్లు కావాల్సి వుందని, అందులో భాగంగానే చంద్రశేఖరన్ ను తీసుకున్నామని సంస్థ వ్యవస్థాపక సీఓఓ రోహిత్ బన్సాల్ వెల్లడించారు. ఈ-కామర్స్ రంగంలో సేవలందిస్తున్న అమేజాన్, ఫ్లిప్ కార్ట్ కు మరింత పోటీని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆకర్షణీయమైన భారీ ఆఫర్ ఇచ్చి చంద్రశేఖరన్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. తనకిచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలనన్న నమ్మకముందని తెలిపారు.

  • Loading...

More Telugu News