: ఐఆర్ సీటీసీ విస్తరణ... 1,144 రైళ్లలో కోరితే భోజనం


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 201 రైళ్లలో అందుబాటులో ఉన్న క్యాటరింగ్ సేవలను 1,144 రైళ్లకు విస్తరించనున్నట్టు ఐఆర్ సీటీసీ వెల్లడించింది. ఈ రైళ్లలో ఆన్ లైన్ లేదా ఎస్ఎంఎస్ ను పంపడం ద్వారా కనీసం భోజనం, టిఫిన్ తదితరాలు బుక్ చేసుకుని కావాల్సిన స్టేషనులో పొందవచ్చని తెలిపింది. కనీస బిల్లు రూ. 60 ఉండాలని వెల్లడించింది. రైల్వే స్టేషన్లలో సరసమైన ధరలకు ఆహారాన్ని అందిస్తున్న 'జన్ ఆహార్' రెస్టారెంట్ల నుంచి ఈ సేవలు అందుతాయని, దీంతో పాటు డొమినోస్, బికనీర్ వాలా తదితర ఔట్ లెట్ల నుంచి శుచి, శుభ్రతలతో కూడిన ఆహారాన్ని పొందవచ్చని తెలిపింది. డెలివరీ కావాలనుకున్న స్టేషనుకు రైలు చేరడానికి కనీసం రెండు గంటల ముందు ఆర్డర్ ఇవ్వాల్సి వుంటుందని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య సర్వీస్ ఉంటుందని వివరించింది. ఒకవేళ ఆహారాన్ని అందించలేకుంటే బ్యాంకు చార్జీలను మినహాయించుకుని మిగిలిన మొత్తమంతా రిఫండ్ చేస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News