: ఎమ్మెల్యేలతో కేసీఆర్ జరిపిన సంభాషణల కాల్ డేటాను దర్యాప్తు చేయాలి: మంద కృష్ణ
2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల చేరికపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ కాల్ డేటా, ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణల మంతనాలను దర్యాప్తు సంస్థలు బయటపెట్టాలని కోరారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత విచారణ జరిపించాలని మంద కృష్ణ అన్నారు.