: చంద్రబాబును జైల్లో పెట్టాల్సిందే... మావోయిస్టుల ప్రకటన
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందేనని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు ఓటుకు నోటు వ్యవహారంపై మావోయిస్టులు కొద్దిసేపటి క్రితం ఓ లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు అడ్డదారులు తొక్కారని ఆ లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. ఎమ్మెల్యేల ఓట్లను కోనుగోలు చేస్తూ చంద్రబాబు తెలంగాణ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు తెరలేపి అడ్డంగా బుక్కైన చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందేనని వారు ఆ లేఖలో డిమాండ్ చేశారు.