: ప్రజలకు ఊరట... సేవా పన్నులో మినహాయింపులు... ఏసీలో తింటేనే పన్ను
సేవా పన్ను బాదుడు నుంచి ప్రజలకు కాస్తంత ఊరట లభించింది. కేవలం ఏసీ రెస్టారెంట్లలో మాత్రమే సర్వీస్ టాక్స్ వసూలు ఉంటుందని, అది కూడా మొత్తం బిల్లులో 40 శాతం మొత్తంపై 5.6 శాతం మాత్రమే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచి పెంచిన సర్వీస్ టాక్స్ అమల్లోకి రాగా, 14 శాతం పన్ను అమలు కానుందని వార్తలు రావడం, కొన్ని రెస్టారెంట్లు అధికంగా వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలతో ప్రజల్లో అయోమయం నెలకొనగా, కేంద్రం స్పష్టత ఇచ్చింది. రెస్టారెంట్లు, ఈటింగ్ ఔట్ లెట్లు, మెస్ లు తదితరాల్లో ఏసీ సౌకర్యం ఉంటే, సర్వీస్ టాక్స్ వసూలు చేయాలన్న నిబంధనలున్న సంగతి తెలిసిందే. విద్యాసెస్ తో కలిపి వివిధ రంగాల్లో పొందే సేవలకు గాను చెల్లించాల్సిన పన్ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెరుగగా, ఏసీ రెస్టారెంట్లలో తీసుకునే ఆహారంపై సేవా పన్ను 4.94 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది.