: మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే అద్భుత ఔషధం రానుంది!


ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న మధుమేహ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఔషధాన్ని తయారు చేస్తున్నామని, ఇది త్వరలోనే మానవ అవసరాలకు ఉపయోగపడుతుందని స్పెయిన్ శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. టైప్-1 మధుమేహాన్ని కూడా ఈ ఔషధం నయం చేస్తుందని వారు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం చుంచులపై మొదలు పెట్టిన టైప్-1 డయాబెటీస్ నిరోధక ఇమ్యునోథెరపీలో విజయం సాధించామని యూనివర్శిటెట్ ఆటోనోమా డీ బార్సిలోనా కేంద్రంగా మధుమేహంపై రీసెర్చ్ జరుపుతున్న టీమ్ వెల్లడించింది. ఈ రీసెర్చ్ కి ఎందరో స్పెయిన్ విద్యార్థులు, ప్రభుత్వం సహకరించినట్టు వర్శిటీ రీసెర్చ్ టీమ్ వెల్లడించింది. మధుమేహాన్ని నియంత్రించే దిశగా, ఇన్సులిన్ ను నాశనం చేసే పాంక్రియాటిక్ కణజాలాన్ని పెంచే యత్నాలకు బదులు, వ్యక్తి రక్తంలో ఉండే డెండ్రిటిక్ కణాలకు మధుమేహాన్ని అధిగమించే శక్తిని అందించే దిశగా తమ పరిశోధనలు సాగాయని వివరించారు. డెండ్రిటిక్ కణాలను బలోపేతం చేసేందుకు, లిపోసోమ్స్ పేరిట ప్రయోగశాలలో సృష్టించబడ్డ నానో పార్టికల్స్ వాడినట్టు తెలిపారు. ఈ లిపోసోమ్స్ ను శరీరంలోకి పంపిస్తే, అవి మధుమేహం పెరగకుండా అడ్డుపడతాయని తెలిపారు. అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, అది లభించిన తరువాత వాణిజ్య పరమైన విక్రయాల దిశగా యోచిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News