: ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి మృతికి కేసీఆర్ సంతాపం
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో శివానందమూర్తి బహుముఖ సేవలందించారని కొనియాడారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.