: హాలీవుడ్ హీరోల సరసన షారూఖ్... జుహీతో కలసి ట్రెనిడాడ్ అండ్ టుబాగో టీమ్ కొనుగోలు


హాలీవుడ్ నటులు మార్క్ వాల్బర్గ్, గెరార్డ్ బుట్లర్ ల సరసన బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నిలిచాడు. భారత ఐపీఎల్ లో కోల్ కతా ఫ్రాంచైజీ యజమానిగా ఉన్న ఆయన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో భాగంగా ట్రెనిడాడ్ అండ్ టుబాగో టీమునూ సొంతం చేసుకున్నాడు. జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతాలతో కలసి షారూక్ ఈ టీమును కొనుగోలు చేశాడు. దీంతో, విదేశీ లీగ్ జట్టును కొనుగోలు చేసిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా షారూక్ నిలిచారు. కరేబియన్ లీగ్ మూడవ ఎడిషన్ పోటీలు జూన్ 20 నుంచి జూలై 26 మధ్య జరగనున్నాయి. కాగా, మార్క్ వాల్బర్గ్ బార్బడోస్ ట్రైడెంట్ టీమ్ లో పెట్టుబడి పెట్టగా, బుట్లర్ తన ఇన్వెస్ట్ మెంటును జమైకా తల్వాహ్స్ టీమ్ లో పెట్టారు.

  • Loading...

More Telugu News