: రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ కు జత కలిసిన కూతురు ఎంగేజ్ మెంట్ ఆహ్వాన పత్రిక!


ఓటుకు నోటు కేసును విచారిస్తున్న ఏసీబీ కోర్టుకు కొద్దిసేపట్లో ఓ అరుదైన పిటీషన్ అందనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై మరికాసేపట్లో కోర్టు విచారణ చేపట్టనుంది. రేవంత్ కు బెయిల్ ఇవ్వరాదని చెబుతూ గట్టి ఆధారాలతో కౌంటర్ తో ఏసీబీ అధికారులు సిద్ధం కాగా, రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిందేనని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరనున్నారు. తమ వాదనకు మరింత బలం చేకూర్చేందుకు లాయర్లు రేవంత్ బెయిల్ పిటీషన్ కు ఆయన కుమార్తె ఎంగేజ్ మెంట్ ఆహ్వాన పత్రికను జత చేశారు. సాధారణ బెయిల్ ఇవ్వడం సాధ్యం కాకున్నా, కనీసం ఇంటెరిమ్ బెయిల్ అయినా మంజూరు చేయాలని వారు కోర్టును కోరనున్నారు.

  • Loading...

More Telugu News