: ఒబామా నివాసం వైట్ హౌస్ లో బాంబు ఉందంటూ ఫోన్!... పరుగులు పెట్టిన ఉద్యోగులు


వైట్ హౌస్ లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మీడియా సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో వైట్ హౌస్ లో బాంబు ఉందంటూ ఫోన్ వచ్చింది. ఏం చెయ్యాలన్నది యోచిస్తుండగానే మరో ఫోన్ వచ్చింది. అది కూడా బాంబు గురించే. రెండు ఫోన్ కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రెస్ బ్రీఫింగ్ రూం, యూఎస్ సెనేట్ ఆఫీస్ భవనాలను తక్షణం ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు, మీడియా పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి ఎటువంటి బాంబూ లేదని తేల్చారు. ఆపై ప్రెస్ బ్రీఫింగ్ 30 నిమిషాలు ఆలస్యంగా జరిగిందని వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఇయర్ నెస్ట్ వెల్లడించారు. బాంబుందని రెండు ఫోన్ కాల్స్ రావడం కాకతాళీయమా? లేక కావాలని చేశారా? అన్న విషయమై దర్యాప్తు సాగుతోంది. కాగా, ఆ సమయంలో యూఎస్ తొలి మహిళ మిచెల్ తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఆ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆమెను మాత్రం అధికారులు ఖాళీ చేయించలేదు.

  • Loading...

More Telugu News