: అట్లాంటాలో ముగిసిన ఆర్తీ అగర్వాల్ అంత్యక్రియలు


లైపో సెక్షన్ ఆపరేషన్ వికటించి గత శనివారం నాడు మరణించిన సినీ నటి ఆర్తీ అగర్వాల్ అంత్యక్రియలు నేడు అట్లాంటాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పూర్తయ్యాయి. ఆమె అంత్యక్రియలు భారత్ లో అభిమానుల సమక్షంలో కాకుండా, పుట్టిన ఊరులోనే చేయాలని నిర్ణయించుకోవడంతో, ఆమెకు తెలుగు సినీ పరిశ్రమ సైతం నివాళులు అర్పించలేకపోయింది. స్థూల కాయం, శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆమె న్యూజెర్సీ పరిధిలోని స్టేట్ అట్లాంటిక్ సిటీలో ఉంటూ, గత వారం తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును తొలగించే ఆపరేషన్ చేయగా, రెండు రోజుల తరువాత గుండెపోటుతో ఆమె మరణించారు. అంత్యక్రియల సందర్భంగా, ఆర్తీ మృతదేహం వద్ద ఆమె తండ్రి బోరున విలపించడం పలువురిని కదిలించింది.

  • Loading...

More Telugu News