: మొదలైన 'జాన్ జీ ఐస్ క్రీం' పోరు


'జాన్ జీ ఐస్ క్రీం' పేరిట బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు క్రికెట్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగును ఎంచుకుంది. భారత్ తరపున మురళీ విజయ్, శిఖర్ ధావన్ లు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లుగా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరితో పాటు ఇండియా తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, సాహా, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, వరుణ్ ఆరోన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు తుది జట్టులో స్థానం లభించింది. బంగ్లాదేశ్ తరపున షాహిద్ తొలి ఓవర్ వేశాడు. ఆ దేశానికి చెందిన తమీమ్ ఇక్బాల్, ఖయీస్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, షువాగత్ హోం, మహమ్మద్ షాహిద్, తైజుల్ ఇస్లామ్, జుబైర్ హోసైన్ లు ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది.

  • Loading...

More Telugu News