: ఫోన్ ట్యాపింగే కాదు, సీఎం సంభాషణల రికార్డూ నేరమే!
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చెయ్యడంతో పాటు, ఆయనకు సంబంధించిన సంభాషణలను రహస్యంగా రికార్డు చెయ్యడం కూడా తీవ్రమైన నేరమని ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ విషయంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య ఓ కేసు సుప్రీంకు వచ్చిన సంగతిని గుర్తు చేశారు. భార్య ఫోన్ సంభాషణలు రికార్డు చేసి ఆమెతో విడాకులకు కోర్టుకెక్కిన భర్తను కోర్టు నేరస్తుడిగా పరిగణించిన విషయాన్ని తెలిపారు. వ్యక్తి అయినా, అధికారి అయినా, మాటలు రికార్డు చేయడం తీవ్రమైన నేరమని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చని ఉన్నతాధికారులు బాబుకు స్పష్టం చేశారు. దీనిపై ఇంకాస్త సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, కేసు పెడితే వెనక్కు తగ్గకుండా ఉండేలా చూడాలని బాబు సూచించినట్టు సమాచారం.