: వెంకయ్యతో చంద్రబాబు భేటీ... సాయంత్రం మోదీ, రాజ్ నాథ్, అమిత్ షాలతో వరుస భేటీలు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, నేటి ఉదయం నుంచే కార్యాచరణలోకి దిగిపోయారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తాను మాట్లాడినట్లు కేసీఆర్ సర్కారు విడుదల చేసిన ఆడియో టేపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు, ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు నిన్న ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం వెంకయ్యనాయుడితో భేటీ అయిన చంద్రబాబు, ఓటుకు నోటు కేసు పూర్వాపరాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News