: దాశరథిని కడసారి కూడా చూడలేనంత బిజీనా?... కేసీఆర్ పై సాహితీవేత్తల ఆగ్రహం


తెలంగాణ అధికారిక పుష్పం మోదుగ పువ్వు. ఆ పువ్వుకు అంత ప్రాచుర్యం కల్పించిన వారు మాత్రం ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి రంగాచార్యే. మలిదశ ఉద్యమంలో దాశరథిని కేసీఆర్ పొగడని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో దారశథి రచనలు కీలక భూమిక పోషించాయని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం దాశరథి రంగాచార్య తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు హైదరాబాదులోనే జరిగాయి. ఈ సమయంలో హైదరాబాదులోనే ఉన్న కేసీఆర్, దాశరథిని కడసారి చూసేందుకు కూడా రాలేదు. ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో తన పని పూర్తైనట్లు కేసీఆర్ వ్యవహరించారని తెలంగాణ సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తొలి తరం ఉద్యమనేతగా కీర్తి ప్రతిష్ఠలందుకున్న ఫ్రొఫెసర్ జయశంకర్ ను కూడా కేసీఆర్ కాలక్రమేణా విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News