: మ్యాగీ నూడుల్స్ లో హానికారక పదార్థాలు లేవు: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
మ్యాగీ నూడుల్స్ లో హానికారక పదార్థాలు ఏమీ లేవని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మ్యాగీ నూడుల్స్ లో హానికారక పదార్థాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడడంతో 22 శాంపుల్స్ ను పరీక్షల నిమిత్తం పంపామని అన్నారు. ఆరు శాంపిల్స్ ఫలితాలు అందాయని ఆయన చెప్పారు. వాటిలో ఎలాంటి హానికారక రసాయనాలు ఉన్నాయని తేలలేదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన ఫలితాలు రాగానే నిషేధం గురించి ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. అయితే సీసం గురించి ప్యాక్ పై పేర్కోకపోవడంతో నెస్లె కంపెనీకి నోటీసులు పంపామని ఆయన చెప్పారు.