: కిడ్నాపర్ ప్రియుడే...ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు


కూకట్‌ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చి మార్కెట్ కి వెళ్లిన మంజూష అనే యువతిని గుర్తుతెలియని దుండగులు నిన్న సాయంత్రం ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మంజూషను అపహరించుకుపోయినట్లు ఫిర్యాదు అందగానే అప్రమత్తమైన కూకట్‌ పల్లి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టారు. మరికొన్ని బృందాలు విచారణ చేపట్టాయి. దీంతో యువతిని అపహరించింది ఆమె ప్రియుడేనని నిర్ధారణకు వచ్చారు. మంజూష 2010 నుంచి శ్రీరాం అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. దీంతో, శ్రీరాం బంధువులను విచారించిన పోలీసులు, వారిద్దరూ గుంటూరులో వివాహం చేసుకున్నట్టు తేల్చారు. వారిద్దరినీ కూకట్ పల్లి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకువచ్చారు. యువతిని బంధువుల ద్వారా తల్లిదండ్రులకు అప్పగిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News