: కేసీఆర్ పై తిరుపతి కోర్టులో కేసు


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై తిరుపతి న్యాయస్థానంలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. తిరుపతి మధురానగర్ కు చెందిన ఊట్ల సురేంద్రనాయుడు అనే వ్యక్తి కేసీఆర్ పై మంగళవారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ను కోర్టులో దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ను ట్యాప్ చేశారని, తప్పుడు ఆడియో టేపులు రూపొందించి ఉభయ రాష్ట్రాల ప్రజలను నమ్మించడానికి కేసీఆర్ కుట్ర పన్నారని సురేంద్రనాయుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. కేసీఆర్ చర్యల కారణంగా ప్రజల్లో వైషమ్యాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News