: నవ్యాంధ్రలో ఐటీ విప్లవానికి సన్నాహాలు


సీఎం చంద్రబాబు నవ్యాంధ్రను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నేడు జరిగిన కేబినెట్ భేటీలో పలు విషయాలు చర్చించిన మంత్రి వర్గం, నవ్యాంధ్రలో ఐటీ విప్లవం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రొక్యూర్ మెంట్ విధివిధానాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో ఐటీ విరివిగా వినియోగించి మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది. 'ఈ-పాలన' కోసం చేసే పరికరాల కొనుగోలులో పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ఈ- పరిపాలనతో నిర్ణయాల్లో కచ్చితమైన సమర్థత, పారదర్శకత పెంచాలని భావిస్తోంది. ఏడు రకాల నిబంధనల కింద ఈ ప్రొక్యూర్ మెంట్ విధానంలో ప్రాజెక్టుకు సంబంధించిన అర్హతలు కలిగిన సంస్థలు, ఏజెన్సీలను ఎంపిక చేసేలా నిబంధనలు రూపొందించింది.

  • Loading...

More Telugu News