: పావు కిలో మీటర్ దేశం...50 మంది జనాభా


పావు కిలోమీటర్ విస్తీర్ణం, 50 మంది జనాభా గల దేశం గురించి విన్నారా? దీనికి ప్రత్యేక దేశంగా అధికారిక గుర్తింపు లేదు కానీ, దీనిని ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. ఇంగ్లాండ్ లోని సఫ్ఫోస్కల్ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రత్యేక ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేసింది ఇంగ్లండ్. సముద్రంలో రెండు పెద్ద టవర్లు నిర్మించి, వాటిపై ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసింది. దీనిపై గన్ లను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంచింది. యుద్ధానంతరం గన్ లను తీసేసి దీనిని నిరుపయోగంగా వదిలేసింది. దీంతో పాడ్డీ రే బేట్స్ అనే వ్యక్తి కుటుంబం సహా దానిపైకి చేరుకుని ఆక్రమించాడు. ఆయన యుద్ధ సమయంలో ఆర్మీ మేజర్ గా పనిచేశాడు. పైరేట్ రేడియో బ్రాడ్ క్యాస్టర్ గానూ పని చేశాడు. దీనిని ఆక్రమించుకున్న అతను 1967లో దీనికి ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్ అనే పేరు పెట్టుకున్నాడు. దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించి, 1975లో దానికి ఓ రాజ్యాంగం, ఇతర గుర్తులను కూడా తయారు చేశాడు. దీని వల్ల ఎన్ని వివాదాలు వచ్చినా రే బేట్స్ పట్టించుకోలేదు. విద్యుదాఘాతం కారణంగా సీ ల్యాండ్ మంటల్లో చిక్కుకుంది కూడా. 2012లో 91వ ఏట ఆయన మరణించగా, ప్రస్తుతం ఆయన కుమారుడు మైకేల్ సీ ల్యాండ్ బాధ్యతలు తీసుకున్నాడు.

  • Loading...

More Telugu News