: ఆ పాట పాడేందుకు ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు: అమితాబ్
భారతీయ సినీ పరిశ్రమలో అమితాబ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అమితాబ్ తో ఓ పాట పాడించాలని 36 ఏళ్ల క్రితం 'మిస్టర్ నట్వర్ లాల్' సినిమా దర్శకుడు రాజేష్ రోషన్ భావించారు. పాట పాడాలని అమితాబ్ కు ఆయన చివరి క్షణంలో చెప్పారు. దీంతో అమితాబ్ లో ఒకటే టెన్షన్! రాజేష్ రోషన్ కు సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. వారి పట్టుదల ముందు అమితాబ్ ఓడిపోయారు. దీంతో పాటపాడక తప్పలేదు. అతి కష్టమ్మీద పాట పాడిన అమితాబ్ స్టూడియో నుంచి బయటపడి హాయిగా ఊపిరి పీల్చుకున్నారట. ఆ పాటను రికార్డింగ్ చేసిన 'మెహబూబ్ స్టూడియో' ఇప్పుడు లేదని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆయన పాడిన 'మేరే పాస్ ఆవో' అంటూ పాడిన పాట సూపర్ హిట్టైంది. 'ఆ పాట పాడేందుకు ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు' అని అమితాబ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.