: కెమేరాలను చూడగానే మీసం మెలేసిన రేవంత్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ మీసం తిప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అరెస్టు చేసినప్పుడు మీసం తిప్పిన రేవంత్ తాజాగా, కస్టడీ ముగిసిన అనంతరం, ఏసీబీ కోర్టు నుంచి బయటికి వచ్చి వ్యానెక్కగానే మీసం మెలేశారు. అక్కడున్న మీడియా కెమేరాలను చూడగానే రెట్టించిన ఉత్సాహంతో మీసంపై చేయివేశారు. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అరెస్టు ద్వారా ఏం చేయలేరంటూ టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మొన్న మీసం తిప్పిన రేవంత్, తాజాగా ఎందుకు తిప్పారన్నది చర్చనీయాంశం అయింది. ఏసీబీ అధికారులు కస్టడీలో తన నుంచి ఏ విషయం తెలుసుకోలేకపోయారనో, లేక, తానే తప్పు చేయలేదని, అన్నీ నిజాలే చెప్పానన్న ధీమానో రేవంత్ ను మరోసారి మీసం మెలేసేలా పురికొల్పాయని అనుకోవచ్చు.