: ఔరా... నేపాల్ లౌక్యం!


భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ ఆత్మస్థయిర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అదే సమయంలో, జాతి ప్రయోజనాల కోసం అవసరమైన లౌక్యాన్ని ప్రదర్శించడమూ మరువలేదు. కొన్ని కారణాలతో ప్రపంచ దేశాల సాయాన్ని నిరాకరించిన ఈ హిమాలయ దేశం... తాజాగా భారత్ ఆఫర్ ను తిరస్కరించింది. దేశంలో భూకంపం కారణంగా దెబ్బతిన్న ప్రదేశాల పునరుద్ధరణకు నిధుల నిమిత్తం జూన్ 25న ఖాట్మండూలో ప్రపంచ దాతల సమావేశం నిర్వహించాలని నేపాల్ సర్కారు నిర్ణయించింది. అయితే, నేపాల్ ప్రభుత్వానికి తామిచ్చిన హామీ ప్రకారం ఆ సదస్సుకు తాము ఆతిథ్యమిస్తామని భారత్ ముందుకొచ్చింది. కానీ, నేపాల్ అందుకు అంగీకరించలేదు. ఈ సమావేశాన్ని తామే నిర్వహిస్తామని, దెబ్బతిన్న టూరిజం రంగాన్ని పునరుద్ధరించుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటామని నేపాల్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News