: 19 ఏళ్లప్పుడు మిస్సయింది...43 ఏళ్లకు దొరికింది


మనకి బాగా ఇష్టమైన వస్తువు పోయి, అకస్మాత్తుగా దొరికిందంటే ఆ ఆనందాన్ని వర్ణించడం కాస్త కష్టమే. అలాంటిది బాగా ఇష్టమైన కారు 24 ఏళ్ల తరువాత దొరికితే... ఇక చెప్పడానికి మాటలు చాలవు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లోని దులత్ పట్టణంలో టెర్రీ డైట్రిష్ (43) అనే మహిళ, 19 ఏళ్ల వయసులో ఉండగా, తనకు ఎంతో ఇష్టమైన బ్లూకలర్ కారును పార్కింగ్ లో పెట్టి షాపింగ్ కు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ కారు కనపడలేదు. పోలీసులకు పిర్యాదు చేసి, కారు కోసం గాలింపు చేపట్టింది. అయినా కారు కనపడలేదు. దీంతో కారు పోయిందని భావించి వదిలేసింది. 24 ఏళ్ల తరువాత ఓ రోజు రోడ్డు పక్కన కారును గుర్తించిన పోలీసులు, కారు ఎవరిది? అని ఆరాతీయగా అది టెర్రీదని గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెకు ఫోన్ చేసి, 'కారు దొరికింది, వచ్చి తీసుకెళ్లండి' అంటూ చెప్పడంతో స్టేషన్ కు వెళ్లిన ఆమె, తన కారును చూసి ఆనందబాష్పాలు రాల్చింది. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News