: అక్కడికెళ్లి మాట్లాడు... తంతారు!: కేసీఆర్ పై ఎర్రబెల్లి ఫైర్


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టుకునేందుకు 20 మంది ఎమ్మెల్యేల బలం టీడీపీకి ఉందని అసెంబ్లీ సెక్రటరీ కూడా లేఖ ఇచ్చారని, కానీ, 63 ఎమ్మెల్యేల మద్దతున్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎలా నిలబెడుతుందని ప్రశ్నించారు. "నువ్వెలా నామినేషన్ వేశావు సిగ్గు లేకుండా? లుచ్చా, లఫంగి వేషాలు వేసింది నువ్వే, తెలంగాణ ద్రోహి జగన్ తో పొత్తు పెట్టుకున్నావ్" అని మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తితో ఎలా ఫోన్ చేసి మాట్లాడతావ్? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలకు కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసే కేసీఆర్ కు వ్యతిరేకంగా మేధావులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే కేసీఆర్ ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. అది తెలంగాణ అడ్డా అని, అక్కడికెళ్లి మాట్లాడితే తంతారని హెచ్చరించారు. దొంగ దీక్ష చేసి విరమించుకుంటే విద్యార్థులు ఉద్యమానికి ప్రాణం పోశారని అన్నారు. ఆయనగానీ, ఆయన కుమారుడుగానీ, అల్లుడుగానీ ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి మాట్లాడాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ ద్వారానే తెలంగాణ వచ్చిందని, ఆయనకు కేసీఆర్ కృతజ్ఞత చూపాలని హితవు పలికారు. కేసీఆర్ పుట్టింది తెలుగుదేశం పార్టీలోనేనని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News