: బాబును ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు: ఈటెల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని సొంత రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా టీడీపీ నేతలు వాదనకు దిగుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత సమస్యను రాష్ట్రాల మధ్య సమస్యగా భ్రమింపజేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవర్నీ నమ్మరని, అందుకే ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్నారని ఈటెల విమర్శించారు.