: లంకెబిందెలు కాదు...ఏకంగా బంగారు గనే బయటపడింది!


సాధారణంగా లంకెబిందెలు దొరికితేనే దశ మారిపోతుంది. అలాంటిది ఏకంగా బంగారం గనే దొరికితే, తలరాతేంటి, తరాల రాత మారిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో అంతులేని సంపద బయటపడింది. ఆ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జిల్లా సోనెభద్ర పేరును సార్థకం చేసుకుంది. వేల కోట్ల విలువ చేసే బంగారు గనిని జిల్లాలోని చోపాన్ ప్రాంతం గుండెల్లో జాగ్రత్తగా భద్రపరచుకుందని గనుల శాఖాధికారులు తెలిపారు. దానిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అనంతరం దాని నుంచి బంగారు ఖనిజం బయటకు తీయనున్నారని యూపీ మైనింగ్ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ లాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News