: పదేళ్ల ఉమ్మడి రాజధానికి అప్పట్లో కేసీఆర్ కూడా అంగీకరించారు: గుత్తా
రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదును ఎన్నేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే విషయంపై జరిపిన చర్చకు అప్పట్లో కేసీఆర్ కూడా హాజరయ్యారని టీకాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆ చర్చలో కొందరు 30 ఏళ్లపాటు రాజధాని ఉమ్మడిగా ఉండాలని ప్రతిపాదించారని... దాన్ని తాము అంగీకరించలేదని తెలిపారు. చివరకు పదేళ్ల ఉమ్మడి రాజధానికి అందరం ఒప్పుకున్నామని చెప్పారు. తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలన్న డిమాండ్లు వచ్చినప్పుడు కేసీఆర్ దాన్ని వ్యతిరేకించలేదని... ఆ ప్రతిపాదనను కూడా కాంగ్రెసే అడ్డుకుందని చెప్పారు. ఇప్పుడు కాలం గడిచిపోయింది, అధికారం వచ్చింది కదా అని కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే దూషిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.