: 99 శాతం హోటళ్లు అక్రమంగా నడుస్తున్నవే!: గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు


గోవాలో ఏర్పాటు కానున్న వివాదాస్పద గోల్ఫ్ కోర్సు ప్రాజక్టుకు మద్దతుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీ కాంత్ పర్సేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పర్నెమ్ తీర ప్రాంతంలో ఉన్న 99 శాతం హోటళ్లు అనుమతులు లేకుండా నడుస్తున్నవేనని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం గోల్ఫ్ కోర్సు ప్రాజక్టు కన్నా అనుమతులు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో గోల్ఫ్ కోర్సుల ఏర్పాటును పర్యావరణ వేత్తలు, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. గోల్ఫ్ కోర్సులకు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలంటే ఇలాంటి గోల్ఫ్ కోర్సు ప్రాజక్టులు కనీసం నాలుగు లేక ఐదు కావాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News