: అమ్మడం, కొనడమే చంద్రబాబు రాజకీయం: బాలినేని
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు రాజకీయమంటే అమ్మడం, కొనడమే అని విమర్శించారు. నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని అన్నారు. వెంటనే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని, విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చంద్రబాబుకు వ్యతిరేకంగా మహాధర్నా చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.