: 15 వరకూ రేవంత్ రిమాండ్ పొడిగింపు


'ఓటుకు నోటు' కేసులో ఇరుకున్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాల జ్యుడీషియల్ రిమాండును ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల కస్టడీ నేటితో ముగిసిపోగా, ఏసీబీ అధికారులు వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పిన అనంతరం వారిని బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, రేవంత్ ను మరిన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదిలావుండగా, 11న జరిగే తన కూతురి నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు అనుమతించాలని రేవంత్ తరపు న్యాయవాదులు రేపు కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News