: అవినీతి కేసులో పీవీనే విచారించారు... చంద్రబాబెంత?: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముడుపుల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆయనను చట్టం శిక్షిస్తుందని స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అప్పట్లో, అవినీతి కేసులో పీవీ అంతటివాడినే విచారించారని ఆయన గుర్తుచేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.