: అయోధ్యలో మందిరం కాదు, హైటెక్ మ్యూజియం కడతారట!


రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం ఓ హైటెక్ మ్యూజియం నిర్మించాలని యోచిస్తోంది. అక్కడ రామ మందిరం నిర్మించాలన్న హిందుత్వవాదుల డిమాండ్లను కొంతకాలం పక్కనబెట్టాలన్నది మోదీ సర్కారు నిర్ణయంగా తెలుస్తోంది. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ మాట్లాడుతూ... ప్రతిపాదిత 'రామాయణ సర్క్యూట్' లో భాగంగా అయోధ్యలో మ్యూజియం నిర్మిస్తామని చెప్పారు. అయితే, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడంలేదని, ఇదో ప్రత్యేకమైన నిర్మాణం అని తెలిపారు. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం తరహాలో ఈ మ్యూజియం ఉంటుందని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News