: ఈ వ్యవహారంలో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా ఉన్నాడు: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్
ఓటుకు నోటు వ్యవహారం మరింత ముదిరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర వ్యాఖ్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని, ఆధారాలు బయటపడ్డాయని అన్నారు. ఈ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఉన్నాడని ఆరోపించారు. కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ చంద్రబాబుదే అని సుమన్ విమర్శించారు. ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పైనా మండిపడ్డారు. పనికిరాని పరకాల ప్రభాకర్ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫోన్ సంభాషణను ఎడిట్ చేశామని పరకాల చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు.