: సూర్యుడికి నమస్కరించని వారు సముద్రంలో దూకి చావండి: మరో వివాదంలో బీజేపీ
ప్రధాని మోదీ ఎంతగా వారిస్తున్నా అధికారం నెత్తికెక్కించుకున్న బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలను వీడడం లేదు. తాజాగా సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు ఇళ్లలో తలుపులేసుకుని బయటకు రావద్దని, లేకుంటే సముద్రంలో దూకాలని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాను వైభవంగా జరపాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆసనాల్లో భాగంగా సూర్య నమస్కారం తప్పనిసరి. అయితే, కొన్ని ముస్లిం సంఘాలు సూర్య నమస్కారం తమ మతాచారానికి వ్యతిరేకమని వాదిస్తున్నాయి. దీంతో ఆసనాల్లో సూర్య నమస్కారాన్ని తొలగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆదిత్యానాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగాలో భాగంగా 'ఓం' అని ఉచ్చరించడాన్ని కూడా కొన్ని మత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.