: కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యల్లో ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది: సోమిరెడ్డి
ఓటుకు నోటు కేసు ఆంధ్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదని కేటీఆర్ అంటుంటే... ఆయన తండ్రి కేసీఆరేమో తెలంగాణ బిడ్డ హైదరాబాదులో రాజ్యమేలుతున్నాడని అంటున్నారని... వీరిద్దరి వ్యాఖ్యల్లో ద్వంద్వ వైఖరి కనపడుతోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తెలుగువారి వెంటపడి, వేధించమని టీఆర్ఎస్ కు జనాలు ఓట్లు వేశారా? అని ప్రశ్నించారు. స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని 2014లో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పిందని... దీనికి వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోలీసుల గురించి అందరికీ తెలుసని అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రులే కోర్టు మెట్లెక్కిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.