: రామకృష్ణ హెగ్డేకు పట్టిన గతే కేసీఆర్ కు కూడా పడుతుంది: సోమిరెడ్డి


హైదరాబాద్ మీ అబ్బ సొత్తా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీఎస్ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై టీడీపీ నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటం వెనుక కేసీఆర్ గాని, ఆయన కుటుంబం కానీ చేసిన కృషి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల వల్లే తెలంగాణ ఈ స్థితిలో ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను అడిగితే, కేసీఆర్ ఎలాంటివాడో చెబుతారని అన్నారు. తెలంగాణ మేధావులు, కళాకారులను అడిగితే కేసీఆర్ చరిత్ర గురించి చెబుతారని మండిపడ్డారు. చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేయడం రాజద్రోహమని చెప్పారు. 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేకు పట్టిన గతే కేసీఆర్ కు కూడా పడుతుందని హెచ్చరించారు. 'మీకు లొంగితే మంత్రి పదవులిస్తారు... వ్యతిరేకిస్తే జైల్లో పెట్టిస్తారా?' అని ప్రశ్నించారు. 13 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న నీవు కూడా ఓ పెద్ద మనిషివేనా? అని నిలదీశారు. మా హక్కులేంటో కేంద్రం, కోర్టుల వద్ద తేల్చుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News