: ఆధారాలు పక్కా?.. రేవంత్ పాస్ పోర్టు సీజ్ చేసిన ఏసీబీ


ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ బలమైన ఆధారాలు సంపాదించిందని తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిపిన సోదాల అనంతరం ఆయన పాస్ పోర్టును, బ్యాంకు ఖాతాలనూ సీజ్ చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఓ వ్యక్తి ఖాతాలు సీజ్ చేయాలంటే, ఆ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలో అవకతవకలు జరిగాయని స్పష్టమైన ఆధారాలు ఉండాలి. ఆ వ్యక్తి విచారణను తప్పించుకుని విదేశాలకు పారిపోయే అవకాశముందని అనుమానం వస్తే పాస్ పోర్టును సీజ్ చేయవచ్చు. రేవంత్ బ్యాంకు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారంటే, ఆ ఖాతా నుంచి నగదు లావాదేవీలపై అనుమానాులు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News