: రేవంత్ ఇంటి కంప్యూటర్లో కీలక ఆధారాలు?


ఈ ఉదయం రేవంత్ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు కంప్యూటర్లో కొన్ని కీలక ఆధారాలు గుర్తించినట్టు సమాచారం. దీంతో కంప్యూటర్, హార్డ్ డిస్క్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంప్యూటర్లో ఓటుకు నోటు వ్యవహారంపై జరిపిన ఆన్ లైన్ లావాదేవీలను గుర్తించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇంట్లో తమ సోదాలు ముగిశాయని, కేవలం హార్డ్ డిస్క్, కంప్యూటర్ మాత్రం తీసుకువెళుతున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ బ్యాంకు లాకర్లను తెరిచేందుకు ఏసీబీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఉదయ్ బ్యాంకు లాకర్లలో డబ్బుందని ఏసీబీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News