: ఏపీ కేబినెట్ కు డీజీపీ... ప్రత్యేకంగా పిలిచిన ప్రభుత్వం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సచివాలయంలోని ఎల్ బ్లాకులో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరయ్యారు. సాధారణంగా కేబినెట్ భేటీలకు పోలీసులకు అనుమతి లేదు. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో టేపుల విడుదల, తదనంతర పరిణామాల నేపథ్యంలో దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం రాముడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో జేవీ రాముడు సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News