: సింగపూర్ పరీక్షల్లో 'పాస్' అయిన భారత మ్యాగీ... ఇక్కడెందుకిలా?
ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ లో ఎటువంటి హానికారక రసాయనాలు లేవని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాగీపై ఇండియాలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో నూడుల్స్ ను పరీక్షించిన సింగపూర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విభాగం అధికారులు, వీటిని తినడం వల్ల వినియోగదారులకు ఎటువంటి అనారోగ్యమూ కలగదని స్పష్టం చేశారు. మ్యాగీపై పరీక్షలు జరిపి ఇండియాలో నిషేధించిన తరువాత అగ్రీ-ఫుడ్ అండ్ వెటర్నిటీ అధారిటీ ఆఫ్ సింగపూర్ (ఏవీఏ) మ్యాగీపై పరీక్షలు జరిపింది. తమ దేశపు సేప్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ నూడుల్స్ సురక్షితమైనవని వెల్లడించింది. అంతకుముందు తాము పరీక్షలు జరిపేంత వరకూ అమ్మకాలు నిలిపివేయాలన్న సింగపూర్ ప్రభుత్వం, ఇప్పుడు తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, సింగపూర్ పరీక్షల్లో దొరకని విషపూరిత రసాయనాలు, భారత్ జరిపే పరీక్షల్లో మాత్రమే ఎందుకు కనిపిస్తోందో!