: ఈశాన్య ఉగ్రదాడి వెనుక చైనా హస్తం... పసిగట్టిన నిఘా వర్గాలు!
భారత సైన్యంపై ఉగ్రవాదులు దాడి జరపడం వెనుక చైనా హస్తముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మణిపూర్ లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారతీయ సైనికులను చంపిన సంగతి తెలిసిందే. ఆపై నాగా మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు అరుణాచల్ ప్రదేశ్ లోని అస్సాం రైఫిల్స్ పారామిలటరీ క్యాంపుపైనా దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సూచనల మేరకు జరిగివుంటాయని భావిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి అంచనా వేశారు. ఈ మేరకు భారత నిఘా వర్గాలు సమాచారాన్ని సమీకరించాయని తెలిపారు.