: భారత్ ఎక్కడుంటే డబ్బు అక్కడే: బంగ్లా స్టార్ క్రికెటర్
క్రికెట్ ప్రపంచంలో ఇండియా ఎక్కడుంటే డబ్బు అక్కడ ఉంటుందని, భారత్ తో క్రికెట్ ఆడటం చిన్న దేశాలకు చాలా మేలు చేస్తుందని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తమ దేశంతో ఇండియా ఆడే మ్యాచ్ లను ప్రపంచమంతా ఆసక్తితో చూస్తారని, అందువల్ల తమ జట్టుకు కూడా మంచి స్పాన్సర్లు లభిస్తారని అభిప్రాయపడ్డాడు. చిన్న చిన్న దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లబ్ధి పొందాలంటే, భారత్ తో ఆడాలని సూచించాడు. కాగా, బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ లు జరగనుండగా, కనీసం ఒకదానిలోనైనా గెలవాలని కోరుకుంటున్నట్టు బంగ్లా టెస్టు జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అంటున్నాడు.