: ఆడియో టేపులు, గవర్నర్ అధికారాలపైనే చర్చ... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ


ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు, హైదరాబాదుపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అధికారాలపై చర్చే ప్రధానంగా మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు బయటపడిన నేపథ్యంలో ఓటుకు నోటు వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వైరాన్ని మరింత పెంచింది. నిన్న జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్ ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దూషణలకు దిగారు. తాజాగా నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాక ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదుపై గవర్నర్ అధికారాలపైనా ఆయన కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద ఏ విధంగా వ్యవహరించాలన్న వ్యూహంపైనే కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News