: నా కథ వినండి... నచ్చితే నటించండి: ఓ అభిమాని 'చిరు' వినతి


తాను చిన్నతనం నుంచి చిరంజీవికి వీరాభిమానినని, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల కోసం తాను రాసిన కథలను ఒక్కసారి పరిశీలించాలని ఓ అభిమాని విజ్ఞప్తి చేస్తున్నాడు. హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడాడు. చిరంజీవి ట్రస్ట్ కోసం 150 సార్లు రక్తదానం చేశానని చెబుతున్న హరికృష్ణ అనే అభిమాని, చిరు సోదరుల కోసమే ఓ కథను రాశానని, వారు దాన్ని ఒక్కసారి పరిశీలించాలని కోరాడు. హరికృష్ణతో పాటు ఫ్యాన్స్ స్టార్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొని, ఈ విషయంలో చిరంజీవి స్పందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News