: రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరుకావాలని చంద్రబాబు, ఏపీ మంత్రుల నిర్ణయం
ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఈ నెల 11న జరగనుంది. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన లేకుండానే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్ణయించుకున్న నిశ్చితార్థాన్ని వాయిదా వేయడానికి అంతగా ఇష్టపడని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బాధతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ఏపీ మంత్రులు, పార్టీ కీలక నేతలతో కలిసి హాజరు కావాలని ఆయన నిశ్చయించుకున్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు ఏపీ మంత్రులు కూడా ముక్తకంఠంతో ఓకే చెప్పారట.