: ఢిల్లీ బయల్దేరిన జగన్... చంద్రబాబే టార్గెట్
వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు, ఎంపీలు కూడా బయల్దేరారు. తన పర్యటనలో ఓటుకు నోటు వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఫిర్యాదు చేస్తారని వైకాపా శ్రేణులు స్పష్టం చేశాయి. రెండు రోజులపాటు ఢిల్లీలోనే జగన్ మకాం వేయనున్నారు. పక్కా ప్రణాళికతో దేశ రాజధానికి జగన్ బయల్దేరడంతో, ఆయన పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.