: అధిక రక్తపోటుతో బాధ పడుతున్న రేవంత్


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లను ఈ ఉదయం వైద్య చికిత్సల నిమిత్తం ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఈ రోజుతో రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీ ముగుస్తోంది. సాయంత్రం విచారణ ముగియగానే ఆయనను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News