: చంద్రబాబును చూస్తుంటే జాలి వేస్తోంది... నవ్వు కూడా వస్తోంది: హరీష్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూస్తుంటే జాలి వేస్తోందని... నవ్వు కూడా వస్తోందని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ కేసుకు మసి పూసి మారేడుకాయ చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారని ఎద్దేవా చేశారు. టీఎస్ ప్రభుత్వంపై గొంతు చించుకుని అరచినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందన్న విషయం అందరికీ అర్థమయిందని చెప్పారు. తెలంగాణ విషయంలో ఎన్నో కుట్రలు చేస్తున్న చంద్రబాబు... భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. రేవంత్ విషయంలో దొంగే దొంగా దొంగా అని అరచినట్టు చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News