: ప్రధాని మోదీతో 'బ్రేకప్' చేసుకున్న రాం జఠ్మలానీ
రాం జఠ్మలానీ... సీనియర్ న్యాయవాదిగా, బీజేపీ నుంచి తొలగించబడ్డ ఎంపీగా సుపరిచితుడే. మోదీనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ముందు గట్టిగా వాదించిన వ్యక్తి కూడా. ఇప్పుడాయన మోదీపై అలిగారు. మోదీతో 'బ్రేకప్' అయిపోయిందని ప్రకటించారు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా కేవీ చౌదరిని నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన మోదీతో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మోదీకి రాసిన లేఖను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. "మీ పట్ల నిత్యమూ తగ్గుతూ వస్తున్న గౌరవం నేటితో పూర్తిగా పోయింది" అని రాం జఠ్మలానీ వ్యాఖ్యానించారు.